అంబాజీపేట మండలం ముక్కామల పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమలాపురం నుంచి వెళ్తున్న బస్సు, రావులపాలెం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.