పి. గన్నవరం మండలం ఉచ్చులవారి పేటలో బుధవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గం దిశానిర్దేశమని కొనియాడారు. విద్యార్థులు ఉన్నత చదువులతో అభివృద్ధి చెందాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.