మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో శ్రీమహాలక్ష్మమ్మ, వనువులమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గరగ నృత్యాలు, చిత్రవిచిత్ర శక్తి వేషధారణలు, సంప్రదాయ కళాకారులతో కూడిన 'చైతన్య రథం' ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల బాణాసంచా కాల్పుల నడుమ జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.