మామిడికుదురు మండలం లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వద్ద మంగళవారం ఆశా కార్యకర్తలు సీఐటీయూ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. తమకు కనీస వేతనం అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం నాయకులు దుర్గాదేవి, దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు.