అయినవిల్లి క్షేత్రంలో భక్తుల సందడి.. రూ. 1. 53 లక్షల ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 1, 53, 094 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు ఈఓ తెలిపారు. అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ. 81, 825 అందినట్లు పేర్కొన్నారు. ఈ రోజు 19 శ్రీ లక్ష్మీ గణపతి హోమాలు, 23 లఘున్యాస అభిషేకాలు, 15 ద్విచక్ర వాహన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సుమారు 1, 821 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా, 916 పులిహోర ప్యాకెట్లు, 738 లడ్డూలు విక్రయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్