అయినవిల్లి మండలంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులు అస్పష్టంగా మారాయి. దీనివల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొలాల్లో మంచు దుప్పటి పరుచుకోవడంతో ప్రకృతి రమణీయంగా మారినప్పటికీ, చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోయారు.