తాటిపాక వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

మామిడికుదురు మండలం తాటిపాక వంతెన సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరం గ్రామానికి చెందిన గుబ్బల మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అతివేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 సిబ్బంది ఈశ్వర్, బలరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్