అంబాజీపేట మండలం నందంపూడి గ్రామ తాజా మాజీ సర్పంచి పితాని మంగాదేవి (36) అస్వస్థతతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగాదేవి అకాల మరణంపై ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఉప ఎంపీపీలు సూదాబత్తుల లక్ష్మీభార్గవి, నేతల నాగరాజు తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.