మామిడికుదురు జడ్పీహెచ్ పాఠశాలలో గురువారం పదో తరగతి విద్యార్థుల కోసం 'ప్రేరణ' అవగాహన కార్యక్రమం జరిగింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రోత్సహించడమే దీని లక్ష్యమని డీసీఈబీ సెక్రటరీ హనుమంతరావు తెలిపారు. 12 పాఠశాలల నుంచి వచ్చిన 122 మంది విద్యార్థులకు నిపుణులు పరీక్షల సమయంలో పాటించాల్సిన మెళకువలు, సమయపాలనపై సూచనలు ఇచ్చారు.