అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏకాదశ రుద్రుల అర్చక బృందం కలిసి ఆశీర్వచనం అందించింది. శుక్రవారం రాయవరం పర్యటనకు వచ్చిన సీఎంకు పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏకాదశరుద్రులతో కూడిన చిత్రపటాన్ని అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపుతో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత లభించింది.