కే. ముంజవరంలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల హామీ మేరకు పింఛను రూ. 4000కు పెంచి, గత మూడు నెలల బకాయిలతో కలిపి రూ. 7000 అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.