గోదావరి జిల్లాలలో పులస చేపకు ఉండే డిమాండ్ తెలిసిందే. ప్రస్తుతం గోదావరి వరదల నేపథ్యంలో పులస చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి వద్ద గోదావరిలో గురువారం చిక్కిన పులస చేపను కోనసీమ పరిధిలోని అయినవిల్లి మండలం శానపల్లిలంకకు చెందిన ఎంపీటీసీ పశ్చిమాల సుబ్బారావు రూ. 22 వేలకు దక్కించుకున్నారు.