అప్పనపల్లి బాలబాలాజీ ఆలయంలో కుడారై సేవా కార్యక్రమం

మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీబాలబాలాజీ ఆలయంలో ఆదివారం అత్యంత పవిత్రమైన కుడారై సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు సకల పాప విముక్తి, ఆరోగ్యం, సంపద, మనశ్శాంతి లభించాలనే సంకల్పంతో ఈ విశేష సేవను ఆచార్య అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయాన్ని పవిత్ర కుడారంతో సర్వాంగ సుందరంగా అలంకరించి, మంత్రోచ్చారణల మధ్య బాలబాలాజీకి విశేష కైంకర్యాలు సమర్పించారు. కుడారై సేవలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్