అయినవిల్లి విఘ్నేశ్వరుని సేవలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్