ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్తా) నాయకులు షబ్బీర్ హుస్సేన్, శానవాజ్ హుస్సేన్ మంగళవారం నగరంలో టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తిని కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. సీపీఎస్ రద్దు, పదోన్నతులు, బదిలీలు, పాఠశాలల్లో వసతుల కొరత వంటి అంశాలపై వారు వినతి అందించారు. ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేశారు.