అంబాజీపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామపంచాయతీలకు తడి-పొడి చెత్త సేకరణ వాహనాలను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పంపిణీ చేశారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి, చెత్త పేరుకుపోకుండా చూడాలన్నదే డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టాక పంచాయతీ వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారని, “స్వచ్ఛ గ్రామం – సుస్థిర అభివృద్ధి” లక్ష్యంతో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.