గోదావరి నది వరదల సందర్భంగా నది దాటడానికి రేవుల వద్ద అన్ని జాగ్రత్తలు చర్యలు పాటించాలని, తీవ్ర ఉధృతంగా ప్రవహించిన సందర్భంలో భద్రతా చర్యల దృష్ట్యా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం పి. గన్నవరం మండల పరిధిలోని గంటి పెదపూడి రేవు ప్రాంతాన్ని ఆయన అధికారుల బృందంతో కలిసి గోదావరి వరద స్థితిగతులను స్వయంగా పరిశీలించారు.