పి. గన్నవరం: వరద ఉధృతి.. తెగిన గోదావరి నదీపాయ గట్టు

గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో గోదావరి నదీపాయపై ఉన్న గట్టు తెగిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పి. గన్నవరం మండలం పరిధిలోని గంటి పెదపూడి-బూరుగులంక గ్రామాల మధ్య గోదావరి నదీ పాయ మధ్య ఉన్న కాలిబాట వంతెన తెగిపోవడంతో నాలుగు లంక గ్రామాల ప్రజలు ఉదయం నుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు వారు పడవలపై ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది.

సంబంధిత పోస్ట్