పి. గన్నవరం మండలం గంటి పెదపూడి శివారులో వరద ఉధృతికి గోదావరి నదీ పాయపై గట్టు కొట్టుకుపోయిన ప్రదేశాన్ని ఆర్డిఓ శ్రీకర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న వారు ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు ధరించాలి అని, పరిమితికి మించి పడవలపై ప్రయాణం చేయవద్దన్నారు. విద్యార్ధులకు సరిపడా లైఫ్ జాకెట్లు అందుబాటులో వుంచామని తెలిపారు.