పి. గన్నవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రాజవరం-పొదలడ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న తురాయి త్రినాథరావు (65) ఆదివారం మృతి చెందారు. గత నెల 21న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పాశర్లపూడిలంకకు చెందిన త్రినాథరావు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్