కీర్తన ఫిన్సర్వ్ సంస్థలో రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బొందల సందీప్, తాడేపల్లి మురళి సభ్యుల నుంచి వాయిదాల కింద వసూలు చేసిన రూ. 26,67,593 దుర్వినియోగం చేసినట్లు పి. గన్నవరం ఎస్సై శివ కృష్ణ తెలిపారు. సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ తాటిపాక నానిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శుక్రవారం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.