పి. గన్నవరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి పరికరాలు సహా మొత్తం 14 రకాల ఉపకరణాలు, రూ. 11 లక్షల విలువలో, తొలి విడతగా 90 మంది లబ్ధిదారులకు అందజేశారు.