పి. గన్నవరం మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్ అధ్యక్షతన, నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 'వెన్నుపోటు రెండేళ్లు' పోస్టర్, బుక్‌లెట్ ఆవిష్కరణ బుధవారం జరిగింది. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ పోరుబాట పేరుతో వీటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.