పి. గన్నవరం: 'విశాఖ రైల్వే జోన్ ప్రకటన చారిత్రక విజయం'

గురువారం జరిగిన ప్రెస్ మీట్‌లో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో సాకారమైందని ఆయన అన్నారు. ఈ రైల్వే జోన్ వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గర్వకారణమని ఆయన కొనియాడారు.

సంబంధిత పోస్ట్