మామిడికుదురు మండలం పాశర్లపూడి లంకలో ఓఎన్జీసీ క్షేత్రంలో గ్యాస్ లీకేజీ అయిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో ఓఎన్జీసీ సాంకేతిక బృందం చాకచక్యంగా వ్యవహరించి బోరుబావి నుండి లీకేజీని అరికట్టారని పరిస్థితి అదుపులో ఉందని, గ్రామస్తులు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదనీ ఆర్డీవో మాధవి తెలిపారు. గురువారం అమలాపురంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.