అయినవిల్లి భవిత కేంద్రాన్ని SSA CMO బీవీవీ సుబ్రహ్మణ్యం బుధవారం సందర్శించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన 'దృష్టి ఎక్సెప్షనల్ లెర్నింగ్' యాప్‌లో డేటా నమోదు ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. రిసోర్స్ టీచర్స్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రత్యేక అవసరాల పిల్లల అభ్యసనంపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. ఈ యాప్ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.