ప్రముఖ యాంకర్ మృదుల ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లిలోని విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి, స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. లోకకళ్యాణం, వృత్తిపరమైన విజయాల కోసం స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చానని మృదుల తెలిపారు. క్షేత్రంలోని ప్రశాంతత తనను ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. యాంకర్ మృదులను చూసేందుకు స్థానికులు, అభిమానులు ఆసక్తి చూపారు.