ముక్కామలలో రేషన్ బియ్యం పట్టివేత: 82 బస్తాలు స్వాధీనం

అంబాజీపేట మండలం ముక్కామల వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 2,988 కిలోల (82 బస్తాలు) రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామిడికుదురులో తక్కువ ధరకు సేకరించిన ఈ బియ్యాన్ని ఆలమూరు పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తరలిస్తుండగా గురువారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు గోకవరపు రాఘవ అవినాష్‌పై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సివిల్ సప్లై గోడౌన్‌కు తరలించారు. అక్రమంగా బియ్యం నిల్వ చేసినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చిరంజీవి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్