గురువారం పి. గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడికుదురు మండలం పాశర్లపూడి సెంటర్‌లో కూటమి ప్రభుత్వ 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిరసనగా టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ బాండ్లను దహనం చేశారు. ఈ నిరసనలో మండల అధ్యక్షుడు కొమ్ముల రాము, పెరి కామేశ్వరరావు, తోరం భాస్కరరావు సహా వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.