పి. గన్నవరం ప్రాంతంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వర్షాకాలం, వరదల సమయంలో మాత్రమే లభించే ప్రసిద్ధ 'పులస' చేప, ఎండలు మండుతున్న ఏప్రిల్ నెలలో జాలర్ల వలకు చిక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గోదావరి నదిలో అన్‌సీజన్‌లో దొరికిన ఈ పులసను గురువారం మార్కెట్‌కు తీసుకురాగా, దానిని దక్కించుకునేందుకు భోజన ప్రియులు పోటీపడ్డారు. చివరికి వేలంలో ఈ పులస ఏకంగా రూ. 4,000 ధర పలికి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.