గంగవరం మండలంలో సంచరిస్తున్న పులి

ఉమ్మడి తూ.గో. జిల్లా గంగవరం మండలంలో సంచరిస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. రాజమండ్రి CCF డా. జ్యోతి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఫిబ్రవరిలో పాపికొండల అడవుల్లో వదిలిన ఈ పులి కోసం ప్రత్యేక ఫీల్డ్, హనుమాన్ బృందాలను రంగంలోకి దించామని, డ్రోన్లు, రేడియో టెలిమెట్రీ, కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ కదలికలపై నిఘా ఉంచామని ఆమె స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్