సీతానగరం మండలంలో యాక్సిడెంట్

సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్ (15) నడుపుతున్న బైకు, రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అతన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్