స్మశాన వాటికను ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

గోపాలపురం మండలం సాగిపాడు గ్రామ ప్రజలకు చెందిన స్మశాన వాటికను తణుకు వేములయ్య అనే వ్యక్తి ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోపాలపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ, మంగళవారం దేవరపల్లి సిఐ, ఎస్ఐ, తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన ఉపాధ్యక్షులు గణపతితో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్