జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు తన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపడంపై తీవ్రంగా స్పందించారు. సోమవారం విజ్జెశ్వరం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తాను ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాననే అసూయతో దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటన నిడదవోలు మండలం పరిధిలో జరిగింది.