గోపాలపురం వద్ద ఆర్టీసీ బస్సులో ఘర్షణ..!

గోపాలపురం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో కండక్టర్, దివ్యాంగుడి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కండక్టర్ దుర్భాషలాడాడని దివ్యాంగుడు, తనపై చేయి చేసుకున్నాడని కండక్టర్ పరస్పరం ఆరోపించుకున్నారు. ఈ వివాదంతో బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బస్సులో ఉన్న ఐదుగురు రోగులు ఉక్కపోతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్