సీఎం సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ప్రత్యేక కృషితో ద్వారకతిరుమల గ్రామానికి చెందిన చింతా దుర్గారావుకి రూ. 40,076, కోలా దేవికి రూ. 61,982 విలువ గల సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను బుధవారం కూటమి నేతలు అందజేశారు. గోపాలపురం వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇమ్మడి రత్నజీ, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ చెక్కుల పంపిణీ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్య ఖర్చులకు ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్