నల్లజర్ల రైతు సేవా కేంద్రం-1 పరిధిలో పచ్చిరొట్ట విత్తనాలు సరఫరాలో జాప్యం పై ఐ. వి. ఆర్. ఎస్ లో చేసిన ఫిర్యాదు నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. శుక్రవారం నల్లజర్ల రైతు సేవా కేంద్రంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రభుత్వం ప్రజలకి అందుతున్న సేవలు అందించే క్రమంలో జవాబుదారీతనం, పారదర్శక విషయంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతోందన్నారు.