తేత్వా తుఫాను: వరి కోతలు 80% పూర్తి, కొనుగోలు కేంద్రాలకు 60% ధాన్యం చేరిక

తేత్వా తుఫాను నేపథ్యంలో దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో వరి వ్యవసాయం కోతలు 80 శాతం పూర్తయ్యాయని, ఇప్పటికే 60 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిందని వ్యవసాయ అధికారి కమల్ రాజ్ తెలిపారు. తుఫాను పొంచి ఉన్నందున, మిగిలిన 20 శాతం వరి కోతలు కోయవలసిన రైతులు రెండు రోజులు ఆగి కోస్తే మంచిదని సూచించారు. కోసిన ధాన్యం ఆరబెట్టే విషయంలో ఇబ్బందులు పడనవసరం లేదని, సొసైటీల వద్ద తార్భన్లు అందుబాటులో ఉన్నాయని, తేమ ఉన్నా సరే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రైతులు ఇబ్బంది పడకూడదని, ధాన్యం విషయంలో ప్రభుత్వ గొడవులను వాడుకోవచ్చని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్