దేవరపల్లి: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగల ముఠా అరెస్ట్

దేవరపల్లి పోలీసులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలను గురువారం పట్టుకున్నారు. జిల్లాలో గత కొంతకాలంగా విద్యుత్ ట్రాన్స్ఫర్లు చోరీకి గురవుతున్నాయని కేసులు నమోదు కావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ మేరకు నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నామని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి 65 కేజీల రాగి దిమ్మలు, 116 కేజీల రాగి వైర్లు, రెండు కార్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్