దుద్దుకూరు గ్రామంలో శుక్రవారం ప్రభుత్వం అందిస్తున్న భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. గ్రామ సచివాలయం సిబ్బంది సహకారంతో వృద్ధాప్య, వికలాంగ, సామాజిక పెన్షన్లతో పాటు తాజాగా మంజూరైన 18 వితంతు పెన్షన్లు పంపిణీ చేయడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుద్దుకూరు నాయకులు కె. తాతారావు, ఉప సర్పంచ్ కె. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.