దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రిన్సిపల్ శైలజ ఆధ్వర్యంలో గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్కూల్స్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు పునాది నుంచే సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన పేర్కొన్నారు. మెగా పేరెంట్స్‌డే సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు, నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.