ద్వారకాతిరుమల టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పాకనాటి శేషుబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. ఈ పదవి ఇచ్చినందుకు గాను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తెదేపా మండల అధ్యక్షులు లంకా సత్యనారాయణకు శేషు బాబు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.