పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం ఆదర్శప్రాయమని ద్వారకాతిరుమల జెడ్పీ హైస్కూల్ ప్రిన్సిపాల్ మత్తె మేరీ త్రిపుర సరళ వాణి అన్నారు. గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డేలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మొగతడకల సంజీవ్ చౌదరి ₹23,000 విలువైన ప్రింటర్‌ను పాఠశాలకు అందజేశారు. ఇది పాఠశాల అవసరాలకు ఉపయోగించాలంటూ సూచించారు. కార్యక్రమంలో పాకనాటి శేషుబాబు, బొండాడ సత్తిబాబు, మొయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.