మాజీ హోంమంత్రి వనిత పరామర్శ: కార్యకర్తకు భరోసా

తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో, ఇటీవల కాలుకు ఆపరేషన్ చేయించుకున్న వైసీపీ కార్యకర్త సింహాద్రి లక్ష్మణ్ రావును, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ హోంమంత్రి తానేటి వనిత బుధవారం పరామర్శించారు. పోతవరం గ్రామంలో కార్యకర్త ఇంటికి వెళ్లిన ఆమె, ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని వనిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్