శుక్రవారం గోపాలపురం మండలం కరచర్లగూడెంలో బోడిగూడెం నుంచి గోపాలపురం సంతకు ఆనపకాయల లోడుతో వస్తున్న ఆటోను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.