పింఛన్ల పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. శుక్రవారం గోపాలపురం నియోజవర్గం ద్వారకాతిరుమల మండలం తిరుమల పాలెంలో నూతనంగా మంజూరైన పెన్షన్లు పంపిణీ చేశారు. పెరిగిన పెన్షన్లతో అవ్వాతాతలకు కష్టాలు దూరం అయ్యాయని చెప్పారు. భర్త చనిపోయిన మహిళలకు స్పౌస్ పింఛన్లు అందించిన ఘనత చంద్రబాబునాయుడుదే అన్నారు.