గోపాలపురం: పేదవారికి అండగా కూటమి పాలన - ఎమ్మెల్యే వెంకటరాజు

నల్లజర్ల మండలంలోని అయ్యవరం, గంటావారిగూడెం, దూబచర్ల, ముసుళ్లకుంట, పుల్లలపాడు గ్రామాల్లో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్థాపనైన ఒక్క సంవత్సరంలోనే గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు చెక్కుల పంపిణీ విషయంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నియోజకవర్గమిదని అన్నారు.

సంబంధిత పోస్ట్