గోపాలపురం: పేద ప్రజల ఆరోగ్యానికి హెల్త్ సబ్ సెంటర్ ఉపయోగం

గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో రూ. 36 లక్షల వ్యయంతో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు ఘంట శ్రీనివాసరావు, తన తండ్రి జ్ఞాపకార్థం 6 సెంట్ల భూమిని అందించారు. శుక్రవారం ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆ స్థలాన్ని చదును చేయించారు. పేదల ఆరోగ్యానికి ఈ సబ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్