దేవరపల్లిలో భారీ వర్షం: జాతీయ రహదారిపై నీరు నిలిచి, జనజీవనం స్తంభించింది

శనివారం రాత్రి దేవరపల్లి మండలాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా, దేవరపల్లి రోడ్డు శివారులో అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న జాతీయ రహదారి బ్రిడ్జిపై ఇరువైపులా వర్షం నీరు నిలిచిపోయింది. మురుగు నీరు ఎటు వెళ్ళలేక అక్కడికక్కడే నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు, స్థానికులు పంచాయితీ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్