ద్వారకాతిరుమల బోర్డు సభ్యురాలిగా కడియం సత్యవతి నియామకం: కూటమి నాయకుల అభినందనలు

ద్వారకాతిరుమల దేవస్థానం బోర్డు సభ్యులుగా గోపాలపురం నియోజకవర్గం దుద్దుకూరు గ్రామ టిడిపి నాయకులు కడియం సత్యవతి నియామకంపై ఎన్డీఏ కూటమి నాయకులు బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి సునాయిల వెంకటేష్, నిమ్మగడ్డ శ్రీనివాస్, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు సoబ బాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నియామకంపై కూటమి నాయకులు సత్యవతికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్